టీఎస్‌ లాసెట్‌ ఫలితాలు విడుదల

11 Jun, 2017 04:49 IST|Sakshi
టీఎస్‌ లాసెట్‌ ఫలితాలు విడుదల
- మూడేళ్ల కోర్సులో 90.7 శాతం ఉత్తీర్ణత 
- ఐదేళ్ల కోర్సులో 71 శాతం ఉత్తీర్ణత 
ఎల్‌ఎల్‌ఎంలో 97.03 శాతం ఉత్తీర్ణత 
 
కేయూ క్యాంపస్‌: తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ 2017 ఫలితాలను టీఎస్‌ లాసెట్‌ చైర్మన్, కేయూ వీసీ ఆర్‌.సాయన్న, లాసెట్‌ కన్వీనర్‌ ఎం.వి.రంగారావు శనివారం వరంగల్‌లో విడుదల చేశారు. గత నెల 27న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సుకు 15,408మంది హాజరుకాగా, 13,955మంది అభ్యర్థులు(90.7 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,031మంది హాజరుకాగా, 2,893మంది (71.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సులో 1,750మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1,698మంది అభ్యర్థులు(97.03«శాతం) ఉత్తీర్ణత సాధించారు.

మొత్తంగా మూడు కోర్సులకు కలిపి 21,189మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 18,546 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (87.53శాతం) సా«ధించారు. ఈ సందర్భంగా వీసీ ఆర్‌.సాయన్న, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.వి.రంగా రావు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 2 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. తెలంగాణలో ఎల్‌ఎల్‌ఎం కోర్సు 13 కళాశాలల్లో ఉండగా, కన్వీనర్‌ కోటాలో 524 సీట్లు ఉన్నాయన్నారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల లా కోర్సులు 21 కళాశాలల్లో ఉండగా కన్వీనర్‌ కోటాలో 2,590 సీట్లు ఉన్నాయన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు సంబంధించి 14 కళాశాలల్లో ఉండగా అందులో 1176 సీట్లు ఉన్నాయని వారు తెలిపారు. లాసెట్‌ ఫలితాలు హెచ్‌టీటీపీ://లాసెట్‌.టీఎస్‌సీహెచ్‌ఈ. ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయ న్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చామని చెప్పారు.
మరిన్ని వార్తలు