నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

30 Mar, 2017 05:35 IST|Sakshi
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

శాసన మండలి దర్బారు హాల్లో కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొత్త ఎమ్మెల్సీలు గురు వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం (మహబూబ్‌ నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డి) నుంచి విజయం సాధించిన పీఆర్టీయూ నేత కాటేపల్లి జనార్దన్‌రెడ్డి రెండో మారు కౌన్సిల్‌లో అడుగుపెట్టనున్నారు.

 అలాగే గతంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ కూడా రెండో సారి కౌన్సిల్‌కు వెళుతున్నారు. కాగా, పార్టీ సీనియర్‌ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మరో నేత మైనంపల్లి హన్మంతరావు తొలి సారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు గురువారం ఉదయం పదిన్నర గంటలకు శాసన మండలి దర్బారు హాల్లో జరిగే కార్యక్రమంలో శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి ఎం రమేశ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నలుగురితో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

మరిన్ని వార్తలు