మాస్కులు లేనివారిని గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ

8 May, 2020 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇకపై మాస్కులు లేకుండా రోడ్డెక్కితే చర్యలు తప్పవు.  ఇందుకోసం తెలంగాణ పోలీస్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రోడ్డుపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించటానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది. సీసీటీవీ నిఘాలో లివరేజింగ్‌ కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లెర్నింగ్‌ టెక్నిన్‌కు ప్రవేశపెట్టనుంది. తద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనుంది. త్వరలో హైదరాబాద్-రాచకొండ-సైబరాబాద్ కమిషనరేట్లో ఈ టెక్నాలజీని అమలు చేయనుంది. ఇలాంటి పద్దతిని పాటించటం ఇండియాలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం.

కాగా, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగిన వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జరిమానా ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. మాస్కులు లేకుండా తిరిగి పట్టుబడిన ప్రతీసారి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి : మాస్క్‌ లేకుంటే జరిమానా  రూ. 1,000

>
మరిన్ని వార్తలు