పాలిసెట్‌–2019  నోటిఫికేషన్‌ జారీ

14 Mar, 2019 02:57 IST|Sakshi

నేటి నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

వచ్చే నెల 16న ప్రవేశ పరీక్ష.. 24న ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌–2019 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి బుధవారం జారీ చేసింది. ఇదివరకే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్‌ రాయవచ్చని పేర్కొంది. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 4వ తే దీ సాయంత్రం 5 గంట ల వరకు ఆన్‌లైన్‌లో (ఠీఠీఠీ.ఞౌ yఛ్ఛ్టి్టట. nజీఛి.జీn) దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.250 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

టీఎస్‌ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల ని సూచించింది. ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 16న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 24న ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. అనంతరం వెబ్‌ ఆప్షన్లు తీసుకొని ప్రవేశాలు చేపడతామని, పూర్తి స్థాయి షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని వివరించింది. వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపింది.

ఇదీ షెడ్యూలు.. 
14–3–2019    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం
4–4–2019    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ముగింపు
16–4–2019    ప్రవేశ పరీక్ష
24–4–2019    ఫలితాలు

మరిన్ని వార్తలు