ఆన్‌లైన్‌లో టెన్త్‌ ‘గ్రేడ్’‌ వివరాలు

22 Jun, 2020 14:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కారణంగా తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఉత్తీర్ణత చేశారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ప్రతిపదికన గ్రేడ్‌లను నిర్ణయించారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్‌ వివరాలను సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్‌ వివరాలను www. bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్‌ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్‌ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. పాస్‌మెమో వివరాల్లో ఎవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి తెలిపారు. 

పని చేయని తెలంగాణ టెన్త్‌ మార్కుల గ్రేడ్ల సైట్‌ 
సోమవారం సాయంత్రం 3 గంటలకు మార్కుల మెమోలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులంతా సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశారు. కానీ సాయంత్రం 5 గంటలైనా www.bsc.telangana.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా