ముగిసిన సవరణ గడువు

5 Jul, 2018 03:23 IST|Sakshi

టీచర్ల వెబ్‌ ఆప్షన్లలో ఎడిట్‌ ప్రక్రియ పూర్తి

ఆప్షన్లు ఇచ్చుకున్న 10 వేల మందికిపైగా టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్ల సవరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సాంకేతిక సమస్యలతో టీచర్లు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమం ఒక్కసారిగా అస్తవ్యస్తమవడంతో క్షేత్రస్థాయిలో ఆందో ళన వ్యక్తమైంది. దీంతో వెబ్‌ ఆప్షన్లను సవరించుకునేందుకు ప్రభుత్వం రెండ్రోజులపాటు అవకాశం కల్పించింది. మంగళవారం గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు అవకాశం ఇవ్వగా 11,749 మంది తమ ఆప్షన్లను సవరించుకున్నారు.

బుధవారం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, భాషా పండితులకు ఎడిట్‌ సౌకర్యం కల్పించింది. రాత్రి 11.59 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో 10 వేల మందికిపైగా టీచర్లు తమ ఆప్షన్లను సవరించుకున్నారు. ఎడిట్‌ అవకాశం ముగియడం తో బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులను ఒకేసారి ఇవ్వాలా లేక కేటగిరీల వారీగా ఇవ్వాలా అనే అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో గురు లేదా శుక్రవారాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 10లోగా బదిలీల ప్రక్రియకు ముగింపు పలకాలని ఆ శాఖ నిర్ణయించింది.

నేటితో ముగియనున్న ఐసెట్‌ వెబ్‌ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ  ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు గురువారం రాత్రి 11:59 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో తెలి పింది. బుధవారం వరకు 24,975 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని, అందులో 7,548 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొంది. మిగతావారు గడువులోగా ఆప్ష న్లు ఇచ్చుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు