ఇదిగో ఇంటర్‌సెంటర్‌

27 Feb, 2018 07:46 IST|Sakshi
ఎగ్జామ్‌ సెంటర్‌ లోకేటర్‌ యాప్‌

లొకేటర్‌ యాప్‌ను రూపొందించిన బోర్డు

నేరేడ్‌మెట్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థులు తమ పరీక్ష కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునేందుకు వీలుగా ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంటర్‌ బోర్డు రూపొందించిన ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు తమ పరీక్ష కేంద్రానికి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఎగ్జామ్‌ సెంటర్‌ లోకేటర్‌గా పిలుస్తున్న ఈ యాప్‌ (tsbie exam center locator 2018) ను గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత సెర్చ్‌లో విద్యార్థి తన హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంట్రీ చేసి క్లిక్‌ చేస్తే వెంటనే పరీక్ష కేంద్రం ఫోటో, పూర్తి వివరాలు వస్తాయి. కింది భాగంలో డైరెక్షన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే పరీక్ష కేంద్రానికి రూట్‌ మ్యాప్‌ కన్పిస్తుంది. ఎన్ని కి.మీ.దూరంలో సెంటర్‌ ఉంది..ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు తదితర సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులకు వీలు కలుగుతుంది.

మరిన్ని వార్తలు