నేడు టెస్కాబ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ 

2 Mar, 2020 04:57 IST|Sakshi

5న చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న జరుగనుంది. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసంహరణలో ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. ఇదిలావుంటే డీసీసీబీ చైర్మన్లంతా టెస్కాబ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా ఉంటారు.  

మరిన్ని వార్తలు