‘అధికారులపై వేధింపులకు పాల్పడితే చర్యలు’

30 Aug, 2018 05:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉన్నతాధికారులపై, కార్మికులపై ఎవరు దూషణలకు పాల్పడినా అకారణంగా వేధించినా సహించేది లేదనీ, వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్‌లో మాట్లాడు తూ.. ఇటీవల సీసీఎస్‌ బకాయిలను చెల్లించాలంటూ జరిగిన నిరసన సందర్భంగా టీఎం యూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు అకారణంగా ఆర్థిక సలహాదారు స్వర్ణ శంకరన్‌పై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు చెందిన సీసీఎస్, పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్‌ నిధులను సంస్థ మళ్లించడం తప్పేనని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేశామన్న సంగతిని గుర్తించాలని విన్నవించారు. ప్రగతి నివేదన సభకు తరలించే బస్సులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

మరిన్ని వార్తలు