నేనే ఆర్టీసీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా

28 Nov, 2019 03:11 IST|Sakshi
కండక్టర్‌ లునావత్‌ కృష్ణానాయక్‌

డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు.. వెళితే కేసులు పెడుతున్నారు 

ఆవేదనతో రాజీనామా చేస్తున్నా 

సీఎంకు సూర్యాపేట డిపో కండక్టర్‌ కృష్ణానాయక్‌ లేఖ 

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీ వైఖరితో తీవ్ర మానసిక వేదనకు గురయ్యా. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. మమ్మల్ని డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు. బస్టాండ్, డిపో చుట్టూ బారికేడ్లు పెట్టారు. లోపలికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. దీంతో ఆవేదన చెందా. మీరు ఉద్యోగం నుంచి తీయడం కాదు.. నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని సోషల్‌ మీడియా వేదికగా సూర్యాపేట డిపోకు చెందిన కండక్టర్‌ లునావత్‌ కృష్ణానాయక్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. కృష్ణానాయక్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్‌ తండా. ఇతను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన లేఖ బుధవారం వైరల్‌ అయింది. 

కృష్ణానాయక్‌ 2009 నుంచి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై కార్మికులు, రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. ఆ లేఖలో.. ‘తెలంగాణలో గౌరవంతో ఉద్యోగం చేద్దామ నుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాను అనే మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రారంభించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను అందులో ప్రస్తావించాడు. ‘కార్మికులు ఏం తప్పుచేశారని.. మహిళలని  చూడకుండా లాఠీలతో కొట్టించడం, అరెస్టులు చేయడం ఏంటి’ అని ప్రశ్నించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరాడు.

పోస్టు నిజమే: కృష్ణానాయక్‌  
మమ్మల్ని డిపో వద్దకు రానివ్వడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్‌ మీడియాతో అందరికీ తెలవాలని సీఎంకు లేఖ రాశా. మేనేజర్‌ కలిస్తే రాజీనామా కచ్చితంగా ఇస్తా.. వెనక్కు పోను.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌

కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో..

నిధులున్నా నిర్లక్ష్యమే!

బయోడైవర్సిటీ ప్రమాదంపై ‘సీన్‌ రీ క్రియేట్‌’

నేటి ముఖ్యాంశాలు..

ఆదివారాలూ ఆధార్‌ సేవలు

మేం రాజీనామా చేస్తాం.. ఆర్టీసీని అలాగే ఉంచండి

వెంటాడిన మృత్యువు

...మేధో మార్గదర్శకం

ఎయిమ్స్‌ పరీక్షలో దుబ్బాక డాక్టర్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌

ఫోన్‌లో పాఠాలు

ఉల్లి మరో 3 వారాలు కొరతే!

కేబినెట్‌ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం...

పరిశ్రమల స్థాపనకు రాయితీలు

రెండో రోజూ అదే సీన్‌

వైద్యుల గైర్హాజరుపై మంత్రి ఈటల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం తన వాటా ఇవ్వకనే.. 

‘ఫాస్ట్‌’గానే ప్రజల్లోకి..

జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!

కొత్తగా ఎనిమిది ‘ఏకలవ్య’ స్కూళ్లు

సీఓఈ కాలేజీల్లో అడ్మిషన్లు షురూ

మిలీనియల్సే టాప్‌

ఉప రాష్ట్రపతిని కలసిన మంత్రి కేటీఆర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది

నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

ఆర్టీసీ సమ్మె: కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు

మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌

కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో..

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!