గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

23 Oct, 2019 10:42 IST|Sakshi
మరణించిన డ్రైవర్‌ గఫూర్‌

నిజామాబాద్‌–2 ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించే దూదేకుల గఫూర్‌ (35) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. సమ్మెపై ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుండడంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారోలేదోనన్న బెంగతో గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. 

సాక్షి, నిజామాబాద్‌ : సమ్మె నేపథ్యంలో.. ఇక తనకు ఉద్యోగం రాదనే బెంగతో కార్మికుడు గుండె నొప్పితో మరణించాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో  మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గఫూర్‌ తన నివాసంలో టీవిలో ఆర్టీసీ సమ్మె వార్తలు చూస్తుండగానే గుండెనొప్పికి గురయ్యా రు.నొప్పిరాగానే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చేగుంట తుఫ్రాన్‌ మధ్యలో గఫూర్‌ ప్రాణాలు విడిచాడు. ఇతనికి భార్య, ఆరు నెలల కుమార్తె తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు.

మొత్తం కుటుంబ భారమంతా ఇతనిపైనే ఉన్నందున మానసికంగా కుంగిపోయాడని తద్వారా గుండెనొప్పి వచ్చిం దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అతడికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఈనేపథ్యంలో వారం రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు గఫూర్‌ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.

గఫూర్‌ మరణవార్తను తెలసుకున్న మం డలంలోని పలువురు ఆర్టీసీ కార్మికులు హుటాహుటిన గోలిలింగాల గ్రామానికి చేరు కుని వివరాలను ఆరా తీశారు. కేవలం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభు త్వం చేస్తున్న తాత్సారమే గఫూర్‌ మృతికి కారణమైందని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిమందికిపైగా గుండెనొప్పితో మరణించారని, ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకెంతమందిని పొట్టనపెట్టుకుంటారని నిజామాబాద్‌ జిల్లా ఆర్టీసీ జెఏఏసీ కో–కన్వీనర్, ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు