ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం

13 Oct, 2019 19:18 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి‌.. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహానికి అదే ఆస్పత్రిలో వైద్యులు పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. అనంతరం భారీ భద్రత నడుమ శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. 

మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించడానికి పలువురు రాజకీయ నాయకులు ఖమ్మం చేరుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుటు వీ హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఖమ్మం డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి నివాళుర్పించడానికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆయన నివాసానికి చేరుకున్నారు.

తోటి కార్మికుడి ఆత్మహత్యతో ఆందోళన మరింత ఉధృతం చేయడానికి కార్మిక సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.

అడ్డుకున్న కార్మికులు
శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని భారీ భద్రత మధ్య ఖమ్మం తరలిస్తుండగా సూర్యాపేట వద్ద ఆర్టీసీ కార్మికులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు నల్గొండ హైవే పై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు