‘సమ్మె’ శాలరీ వచ్చేసింది

12 Mar, 2020 02:13 IST|Sakshi

ఆర్టీసీ సమ్మె కాలానికి నిధులు చెల్లిస్తూ ప్రభుత్వ నిర్ణయం

రూ. 235 కోట్లు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. గతేడాది జరిగిన ఆర్టీసీ సమ్మె కాలానికి సంబంధించి వేతనానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీకి రూ.235 కోట్ల మొత్తాన్ని ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 25 వరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. తొలుత సమ్మెను ప్రభుత్వం పట్టించు కోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టింది. అదే సమయంలో కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసు కోగా, దాదాపు 30 మంది గుండెపోటుతో చనిపోయారు. చివరకు కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. అప్పటివరకు సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. అదే సమయంలో సమ్మె కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నట్టు, ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆమేరకు ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనాల కోసం తాజాగా రూ.235 కోట్లు విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు