నేడు డిపోల వద్ద ర్యాలీలు: జేఏసీ

23 Nov, 2019 04:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సీఎం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించినా, విధుల్లోకి తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం దారుణమని పేర్కొంది.

జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు శుక్రవారం సమావేశమై దీనిపై చర్చించారు. తర్వాత శనివా రం నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్టు చెప్పారు. అన్ని డిపోల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించాలని కార్మికులకు సూచించా రు. మరోవైపు శుక్రవారం కూడా చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వచ్చారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులనే కలిసి మాట్లాడుకోవాలంటూ డిపో మేనేజర్లు తిప్పి పంపారు. 

మరిన్ని వార్తలు