‘ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తోంది’

20 Sep, 2019 16:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికలు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తుందని టీఎస్‌ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏపీ తరుపున ఆయన శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యంకు సమ్మె నోటీసులు అందచేశారు. అనంతరం అశ్వద్ధామ మాట్లాడులూ.. తెలంగాణలో ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని, ఈ నెల 23, 24 తేదీల్లో సంస్థ డిపోల ముందు ధర్నాలు చేయనున్నామని, దీనిని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని గుర్తు చేసిన ఆయన.... మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు.

ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకే సంస్థను పిచ్చికుక్కలా తయారు చేస్తోందనిడ్డి మండిపడ్డారు. దీనిపై అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ​ప్రస్తుతం ​సంస్థ నష్టాల్లో లేదని, ఓఆర్ పెరిగిందని అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే నష్టాల పేరు ఎత్తుతోందని, లాభ నష్టాలతో సంబంధం లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలన్నారు. ​ 2013లోనే ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని,  విలీనంపై హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చి నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అశ్వద్ధామ పేర్కొన్నారు.

కో-కన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు ​అన్ని యూనియన్లతో కలిసి పోరాడుతామని, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని కోరారు. ​ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ ​కార్మికులను తగ్గించినా సంస్థ ఆదాయం పెంచామని అన్నారు. ​ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని సూచించారు. ​పక్క రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని... ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని గుర్తు చేశారు. 

కో- కన్వీనర్‌ వీఎస్ రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.3.6 కోట్లు పన్నుల రూపంలో కడుతున్నామని, ఎవరికీ పన్నులు లేనప్పుడు తమకెందుకు పన్నుల వేస్తారని ప్రశ్నించారు. ​సామాజిక బాధ్యతగా సర్వీసులు నడుపుతున్నామని, రైతు ఆత్మహత్యలులతో పాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ​అసెంబ్లీలో చేసిన చట్టాలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు