సంక్రాంతి ఎఫెక్ట్‌.. ఇప్పటికే 300 బస్సులు ఫుల్

5 Jan, 2019 13:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు టీఎస్ ఆర్టీసీ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 300బస్సులు ఫుల్ అయ్యాయన్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేశామని, మొత్తం 5252 బస్సులు సిద్దం చేశామన్నారు.

'ఎంజీబీఎస్ నుండి 3400 బస్సులు తిరుగుతాయి. ఉత్తర తెలంగాణ బస్సులు 10వ తేదీ నుండి 14వరకు జేబీఎస్ నుండి నడుస్తాయి. నల్లగొండ వెళ్లే బస్సులు దిల్‌షుఖ్‌నగర్ నుండి, వరంగల్ వెళ్లే బస్సులు ఉప్పల్ నుండి వెళ్తాయి. కర్నూలు అనంతపురం వెళ్లే రెగ్యులర్ బస్సులు ఎంజీబీఎస్ నుండి, స్పెషల్ బస్సులు సీబీఎస్ నుండి బయలు దేరుతాయి. వికారాబాద్, తిరుపతి, మహబూబ్ నగర్, బెంగుళూరు బస్సులు ఎంజీబీఎస్ నుండి వెళ్తాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సులు నగర శివార్ల నుండే బయలుదేరుతాయి.

వెయ్యి బస్సులను ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించాము. ప్రయాణికుల సేవల కోసం 24గంటలూ అధికారులు అందుబాటులో ఉంటారు. స్పెషల్ బస్సులకు స్పెషల్ చార్జీలు ఉంటాయి. 50శాతం అదనంగా చార్జీలు ఉంటాయి. రిజర్వేషన్లలో విశాఖ, అమలాపురం, రాజోలు వంటి ప్రాంతాలకు డిమాండ్ అధికంగా ఉంది. 1592బస్సులను తెలంగాణకు, 3670 బస్సులను ఏపీకి నడపనున్నాము. సిటీ బస్సులను కూడా వినియోగిస్తాం. రోజుకు 400 మెట్రో ఎక్స్ ప్రెస్, లైనర్లు, డిలక్స్ బస్సులను వాడుతాము. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుండి బస్ పాయింట్ల వద్దకు షెటిల్ బస్సులను తిప్పుతాము' అని యాదగిరి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు