ఆర్టీసీ సమ్మె: ఏపీలో ఉద్యమాలు

29 Oct, 2019 15:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేత దామోదర్‌ మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. వీరికి మద్దతుగా ఏపీలోనూ ఉద్యమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘గతంలో చంద్రబాబుకు పోటీగా ఒకశాతం అదనంగా ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కమిటీ వేశారు. మరి ఆ పని మీరెందుకు చేయడం లేదు’ అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కార్మికులు సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు.

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘం నేత వైవీ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కేసీఆర్‌ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇక్కడ కార్మికులు పోరాటం ప్రారంభించాక వారికి మద్దతుగా ఏపీలో కూడా జేఏసీగా ఏర్పాటై ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సరే, పోరాటంలో కార్మికులదే అంతిమ విజయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఫెడరేషన్‌ కూడా ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడించారు. త్వరలో అన్ని రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో కలిసి ‘చలో తెలంగాణ కార్యక్రమం’ చేపడతామని ప్రకటించారు.
(చదవండి: 25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు)

సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ థామస్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం సంస్థకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కోర్టుకు వివరించామన్నారు. 25 రోజులుగా జరుగుతున్న సమ్మెలో 28 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ విడిపోలేదని.. సంస్థలు, సర్వీసులు కలిసే ఉన్నందున అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసినట్టే ఇక్కడా చేయమంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పల్లె వెలుగు నష్టాలు ప్రభుత్వం భరించాలని... నష్టాన్ని భరించలేకపోతే సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  కార్మికులు సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోతీ నగర్‌లో తప్పిన ప్రమాదం; అదుపులో తాత్కాలిక డ్రైవర్‌

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా’

సీపీఐ ‘ఛలో డీజీపీ ఆఫీస్‌’.. ఇంతలో షార్ట్‌ సర్య్కూట్‌

25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు

అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా..

ఆరు నెలలైనా జీతం రాకపాయే..

మెట్‌పల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు

ధూమ్‌..ధామ్‌ దండారి

హైదరాబాద్‌ సమీపంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ కొత్త ప్లాంటు

1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం

పీజీ చేసినా కాన్పు చేయడం రాదాయే! 

కేటీఆర్‌ను కలసిన సైదిరెడ్డి

యాదాద్రి తలమానికం 

‘సీఎం అబద్ధాలు చెప్పారు’

మున్సిపల్‌ ఎన్నికలు.. నేడు ఈసీ కీలక నిర్ణయం

పొన్నాల కారును ఢీకొట్టిన షూటింగ్‌ వాహనం

త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి

ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం కీలక నిర్ణయం

కేసీఆర్‌ కిట్‌ గ్లోబల్‌ టెండర్లతో ఆదా

ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత

పోలీసు, న్యాయవ్యవస్థ నాణేనికి రెండు ముఖాలు

కేసీఆర్‌ చరిష్మా.. ఆరేళ్లుగా హ్యాపీ జర్నీ!

ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్‌

డబ్బా ఇసుక రూ.10

‘నీరా’ వచ్చేస్తోంది.. త్వరలో మార్కెట్లోకి!

మీరు హాస్టల్­లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!

అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి

ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!