స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం.. ఆస్పత్రికి తరలింపు

23 Oct, 2019 11:47 IST|Sakshi

సాక్షి, భద్రాచలం: పని ఒత్తిడి కారణంగా భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను... ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంకు డాక్టర్లు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే విశ్రాంతి లేకపోవడం కారణంగానే ఆయన అలసటకు గురై లో బీపీతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా డీఎం సృహ కోల్పోయిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పని ఒత్తిడికి గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు