దండం పెట్టి.. పూలు ఇచ్చి...

23 Oct, 2019 08:43 IST|Sakshi
పూలు ఇస్తున్న ఆర్టీసీ కార్మికులు

18వ రోజు వినూత్న నిరసన

బస్‌స్టేషన్‌లోకి వెళ్లకుండాఅడ్డుకున్న పోలీసులు

కార్మికులను చెదరగొట్టడంతో ఉద్రిక్తత

సాక్షి, మంచిర్యాల : ‘ఆర్టీసీలో ఖాళీలు భర్తీచేస్తే మీకూ పర్మినెంట్‌ ఉద్యోగాలు వస్తాయి.. ఈరోజు మేం చేసేది కూడా ఉద్యోగభద్రత, సంస్థ పరిరక్షణ కోసంమే.. మా పొట్టకొట్టకండి..’ అంటూ ఆర్టసీ కార్మికులు  తాత్కాలిక డ్రైవర్లను వేడుకున్నారు. చేతికి పూలు ఇచ్చి.. దండం పెడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జేఏసీ శిబిరం నుంచి బస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా.. పోలీసులు అప్రమత్తమై నిలువరించారు. శాంతియుతంగా వెళ్లి తాత్కాలిక కార్మికులను కలిసి తమ గోడును చెప్పుకుంటామని కార్మికులు పోలీసులను ప్రాథేయపడ్డారు. చివరకు అక్కడే ఉన్న తాత్కాలిక కార్మికులు పోలీసుల వలయంలో భారికేడ్ల వద్దకు రాగా అవతలివైపు నుంచి కార్మికులు పూలు ఇచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. మరోవైపు వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి.

దీంతో మరికొందరు కార్మికులు రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులను ఆపి.. పూలు ఇచ్చి దండం పెడుతూ విధులకు హాజరుకావొద్దని బతిమాలాడారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ అటుగా రావటం.. కార్మికులను అదుపులోకి తీసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కార్మికులందరినీ చెదరగొట్టారు. బస్టాండ్‌ సమీపంలోని రహదారిపై, జేఏసీ శిబిరం వద్ద  ఉన్న కార్మికులను అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనంలో ఎక్కించి పలు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఉద్యోగి సోమ్మసిల్లి పడిపోవటంతో ఆసుపత్రికి తరలించారు. 
కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీస్‌ రక్షణతో రోడ్డెక్కిన బస్సులు

ఓపెన్‌స్కూల్‌ పిలుస్తోంది

ధర్నా చేస్తే క్రిమినల్‌ కేసులు

జూరాలకు భారీ వరద

రమ్య దొరకలే..!

ఇక ఎప్పుడైనా.. బల్దియా పోరు 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిఫరల్‌ వ్యవస్థ

మా పొట్ట కొట్టకండి..

నిలకడగా చిన్నారుల ఆరోగ్యం 

అద్దె బస్సుల టెండర్‌పై స్టేకు నో

బెట్టు వద్దు..మెట్టు దిగండి

పుప్పాలగూడ భూములు సర్కారువే

పాపిలాన్‌ పట్టేస్తోంది!

కార్మికుల డిమాండ్లపై కేసీఆర్‌ కీలక ఆదేశాలు

ప్లాస్టిక్‌ భరతం పట్టే కొత్త టెక్‌!

మిగిలింది ‘రిజర్వేషన్లే’ 

మున్సి‘పోల్స్‌’కు లైన్‌ క్లియర్‌

ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వం కీలక నిర్ణయం

మున్పిపల్‌ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

కానిస్టేబుల్‌ ఫలితాలపై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మె: మంచిర్యాలలో ఉద్రిక్తత

తిరుమలలో దళారీ వ్యవస్థకు చరమగీతం

'రాజకీయ లబ్ధికోసమే బీజేపీ గాంధీ సంకల్పయాత్ర'

నిజామాబాద్‌లో కాలువలోకి దూసుకెళ్లిన కారు..

మలేషియాలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్‌

ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..

చారిత్రాత్మక నిర్ణయం : రంగరాజన్‌

కార్మికులకు హెచ్చరిక; దాడి చేస్తే చర్యలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు