ఆర్టీసీ ఆపరేషన్‌ షురూ!

9 Oct, 2019 16:15 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌ :  ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ .. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించి విషయం తెలిసిందే. తాజాగా కొత్త ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకాలు చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు కొత్త నియామకాలకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అన్ని డిపో మేనేజర్లతో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొత్త అద్దె బస్సులు, నోటిఫికేషన్‌పై చర్చించారు. రేపటి నుంచి మరిన్ని బస్సులను పెంచాలని అధికారులను ఆదేశించారు. బస్‌పాసులను కచ్చితంగా అనుమతి ఇచ్చేలా తాత్కాలిక, ప్రైవేట్‌ ఉద్యోగులకు కూడా ఆదేశాలివ్వాలని సూచించారు. ప్రయాణికుల రద్దికి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేసుకోవాలని  డిపో మేనేజర్లకు సూచించారు. మరో 10 రోజుల్లో ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు
ఆర్టీసీ కార్మికుల సమ్మే నేపథ్యంలో ప్రైవేట్‌ వాహనదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  పండగ వేళ గ్రామాల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బంది కాకుండా 5వేలకు పైగా ఆర్టీసీ బస్సులను రోడెక్కించారు. ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా ఆర్టీసీ సేవలు అందిస్తున్నారు. అయితే వారు మాత్రం ప్రయాణీకుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. టికెట్లు ఇవ్వకుండానే ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇక పండగకు ఊరెళ్లి తిరిగి వస్తున్న నగర వాసులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల నుంచి ఎలాగోలా జూబ్లీబస్టాండ్‌ చేరుకున్నా.. అక్కడి నుంచి సీటీలోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు డబ్బులు ఇచ్చి సిటీలోకి వెళ్తున్నారు. సమ్మె విషయంలో అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో పండగ వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమ్మె విస్తృతం చేస్తామంటున్న కార్మిక జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. అయినప్పటీకి ప్రభుత్వం దిగిరాకపోవడంతో తమ సమ్మెను విస్తృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ ప్రణాళిక రచిస్తోంది.వంట వార్పు, తెలంగాణ బంద్‌, గవర్నర్‌, కేంద్ర మంత్రులను కలవడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేంద్ర మంత్రిని కలిసిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

రవిప్రకాశ్‌ కస్టడీ పిటిషన్‌: కోర్టు విచారణ

ప్రారంభమైన కేంద్ర హోంశాఖ సమావేశం 

మదీనాగూడలో రిలయన్స్‌ జూవల్స్‌ షోరూం ప్రారంభం

19న తెలంగాణ బంద్‌!

‘తలసాని అంతటి మూర్ఖుడు ఎవరు లేరు’

హైదరాబాద్‌: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ఆర్టీసీ సమ్మె : మద్దుతుపై పునరాలోచిస్తామన్న చాడ

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

ఆర్టీసీ ఆస్పత్రిలో కార్మికులకు వైద్యం నిలిపివేత

‘కర్రు కాల్చి వాత పెడతారు జాగ్రత్త..’

ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్‌ చేస్తారా?

సెప్టెంబర్‌ నుంచి పెరిగిన లెర్నింగ్‌ లైసెన్స్‌లు

మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం

పొదుపు పేర.. మోసం!

పాప వైద్యానికి కేటీఆర్‌ భరోసా

‘హరీశ్‌తో మాటల్లేవ్‌.. అయినా మాట్లాడాను’

విమాన ప్రమాదంపై దర్యాప్తు

10న యువ కవి సమ్మేళనం

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ పొందండిలా..

సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్‌ అతడిదే

టుడేస్‌ న్యూస్‌

ఈనాటి ముఖ్యాంశాలు

అడుగడుగునా ట్రాఫిక్‌ గండం!

పరుగో పరుగు..

ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు

'శభాష్‌.. గణేష్‌'

పల్లెబాట పట్టిన మహానగరం

దారి దోపిడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బ్రేకప్‌పై స్పందించిన నటి

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!