16వ రోజుకు సమ్మె: మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

20 Oct, 2019 10:38 IST|Sakshi

మెట్టు దిగని సర్కార్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది.  నిరసనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ప్లకార్డులతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఓ వైపు సమ్మె విరమించి చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం పిలుపునిస్తుంటే.. డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించారు. దీంతో ప్రతిష్టంభన కొనసగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. యాజమాన్యం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు తెలిపారు.  సమ్మె భవిష్యత్‌ కార్యచరణ నేపథ్యంలో రాజకీయ జేఏసీతో కార్మిక సంఘాలు నేడు భేటీ కానున్నాయి.

మరో కార్మికుడి మృతి
ఈ క్రమంలో ఖమ్మంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్‌ ఎస్కే ఖాజామియా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మెలో ఖాజామియా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. సమ్మె విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలోనే ఖాజామియా మనస్తాపంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల ఆర్టీసీ జేఏసీ, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు