25వ రోజుకు ఆర్టీసీ సమ్మె: చరిత్రలోనే పెద్దది రికార్డు

29 Oct, 2019 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్ల సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలో ఇదే అతి పెద్దదిగా రికార్డు నమోదు చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 27 రోజులపాటు సమ్మెలో పాల్గొన్నారు. కానీ కార్మికుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా జరిగిన సమ్మెల్లో మాత్రం ఇదే పెద్దది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ- వేతన సవరణ డిమాండ్‌తో 24 రోజులపాటు సమ్మె చేశారు. 1967లో 20 రోజులపాటు సమ్మె జరిగింది. ఇక, సమ్మెలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సమ్మెపై హైకోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. 
 

మరిన్ని వార్తలు