ఆర్టీసీ సమ్మె: విధుల్లోకి వస్తామన్నా తీసుకోవడం లేదు

27 Nov, 2019 17:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలైంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పిటిషన్‌లో సవరణలు చేసి ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వర్‌రావు తిరిగి పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామన్నా తీసుకోవడం లేదని పిటిషనర్‌ న్యాయస్థానానికి తెలిపాడు. జీతాల్లేక కుటుంబాలను పోషించలేక ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. 

కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి యాభై రోజులు దాటింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టుదిగకపోవడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తామన్నారు. అయితే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించడంతో కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: వస్తామంటే.. వద్దంటారా?)

మరిన్ని వార్తలు