ఆర్టీసీ సమ్మె : గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్‌

21 Oct, 2019 14:10 IST|Sakshi
కార్మికుల నిరసన ప్రదర్శన (ఫైల్‌)

సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బైఠాయించి సోమవారం దీక్షకు దిగారు. వామపక్ష, బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీలు దీక్షకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ నాయకులను, వామపక్ష, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్ వీఎస్‌ఎన్‌ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన అక్కకికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీఎస్‌ఎన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకుం‍ది.
(చదవండి : సమ్మె: హైకోర్టులో మరో మూడు పిటిషన్లు)

ఇదిలాఉండగా.. తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ‘చలో ప్రగతి భవన్‌’  ఉద్రిక్తంగా మారింది. సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, విక్రం గౌడ్‌, రాములు నాయక్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.   మరోవైపు కాంగ్రెస్‌ నేతలను తెలంగాణవ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లతో, ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి నేతలను పోలీసులు గృహ నిర‍్బంధం చేశారు.
(చదవండి : బైక్‌పై దూసుకొచ్చిన రేవంత్‌రెడ్డి)

మరిన్ని వార్తలు