‘చలో ట్యాంక్‌బండ్‌’ ఉద్రిక్తం

10 Nov, 2019 02:53 IST|Sakshi
ట్యాంక్‌బండ్‌ వద్ద ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీచార్జ్‌,లిబర్టీ చౌరస్తా వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న కార్మికులు 

నలువైపులా దిగ్బంధనాలు.. ఎక్కడికక్కడ అరెస్టులు

ఆందోళనకారులపై బాష్పవాయువు, లాఠీచార్జి

పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

పలువురికి గాయాలు.. దాదాపు 3,800 మంది అరెస్టు

కార్యక్రమం విజయవంతమైందని ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

మరోమారు బంద్‌కు పిలుపునిచ్చే యోచన?

ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసేసినా ఆందోళనకారులు ఎలాగోలా అక్కడకు చేరుకున్నారు. జిల్లాల్లోనూ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు లాఠీలు, తూటాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దాదాపు 3,800 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: సకల జనుల సామూహిక దీక్షను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించుకునేందుకు ఆర్టీసీ కారి్మకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరినీ రానీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, మారియట్‌ హోటల్‌ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్‌ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్‌ తదితర ప్రాంతాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే మారియట్‌ చౌరస్తా, లిబర్టీ చౌరస్తాల వద్ద ట్యాంక్‌బండ్‌ వైపునకు వెళ్లే దారులను మూసేశారు. పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచి్చన కండక్టర్‌లు, డ్రైవర్‌లను గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. 

పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుడు 

బందోబస్తును ఛేదించుకొని... 
చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొనడం కోసం వివిధ పారీ్టల నాయకులు ముందుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని తమ పార్టీ కార్యకర్తలు, కారి్మకుల ఇళ్లలో తలదాచుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తొలుత సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. వెంకటేశ్వర్‌రావు, కె. గోవర్ధన్‌లతోపాటు 50 మంది కార్యకర్తలు ఇందిరాపార్క్‌ చౌరస్తాలోకి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేయగా కాసేపటికే మారియట్‌ హోటల్‌ సమీపంలోని కవాడిగూడ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, గౌతమ్‌జీల నేతృత్వంలో వందలాది మంది ట్యాంక్‌బండ్‌పైకి దూసుకురావడానికి ప్రయతి్నంచగా పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వచ్చారు. అదే సమయంలో పోలీసుల దృష్టి మళ్లించి రాణిగంజ్, హకీంపేట్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచి్చన కారి్మకులు పోలీసు బందోబస్తు, బారికేడ్లను ఛేదించుకొని ట్యాంక్‌బండ్‌పైకి వందలాదిగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని బతుకమ్మ ఘాట్‌ వద్ద అడ్డుకొని అరెస్టు చేశారు.

చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో శనివారం ట్యాంక్‌బండ్‌ పైకి దూసుకొస్తున్న ఆందోళనకారులు  

అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా రణరంగం
ఇదే సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నున్న నాగేశ్వర్‌రావు, వెంకట్, మల్లు లక్షి్మ, అరుణోదయ విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్యల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ ట్యాంక్‌బండ్‌వైపు దూసుకువచ్చారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద మరోసారి వారిని అడ్డుకోవడానికి ప్రయతి్నంచినా పోలీసులకు సాధ్యంకాలేదు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకోగానే వారికి ఎ.వి. కళాశాలలో ఉన్న వందలాది మంది ఆందోళనకారులు జత కలిశారు. ఇదే సమయంలో హిమాయత్‌నగర్, లిబర్టీ దగ్గర నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు వారికి తోడయ్యారు.

అశోక్‌నగర్‌లోని ఆయన నివాసంలో కె.లక్ష్మణ్‌ గృహనిర్బంధం 

ఆర్టీసీ కారి్మకులకు మద్దతుగా సకల జనుల సామూహిక దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారమే హైదరాబాద్‌ చేరుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లేందుకు యతి్నంచగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రొఫెసర్‌ కోదండరాంను అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌వైపు నుంచి ఆర్టీసీ కార్మికులు వందలాది మంది మహిళలు, కారి్మకులు తరలిరావడంతో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వేలాది మంది చేరారు. అంతా కలసి ట్యాంక్‌బండ్‌వైపునకు వెళ్లి బారికేడ్లను తొలగించడానికి ప్రయతి్నంచారు. కొందరు బారికేడ్లను దాటి ట్యాంక్‌బండ్‌ చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు... ఉన్నతాధికారుల ఆదేశం మేరకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి ఆపై లాఠీచార్జి చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి లిబర్టీ, దోమలగూడవైపు ఆందోళనకారులను తరిమారు. ఆగ్రహానికిగురైన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా మోత్కూరి శేఖర్‌ అనే ఎస్‌ఐకి గాయాలయ్యాయి. చివరకు తమ్మినేని, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం సహా వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

పలువురికి గాయాలు... 
పోలీసుల లాఠీచార్జి్జలో పలువురికి గాయాలయ్యా యి. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్‌ శేషమ్మ ముక్కుకు తీవ్ర గాయమవగా ముషీరాబాద్‌ డిపో–1కు చెందిన ఆర్టీసీ కారి్మకుడు ఆశయ్యకు, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పీడీఎస్‌యూ నేత అనిల్‌కు కా ళ్లు విరిగాయి. మరోవైపు ఆందోళనకారుల దాడిలో చిక్కడపల్లి ఏసీపీ కిరణ్‌ సైతం గాయపడ్డారు. 

ట్యాంక్‌బండ్‌ను చేరుకొని చూపించాం.... 
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాదాపు వెయ్యి మంది కారి్మకులం ట్యాంక్‌బండ్‌ చేరుకొని చూపించామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. వేల మంది కారి్మకులు స్వచ్ఛందంగా పాల్గొని చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేశారన్నారు. సరూర్‌నగర్‌ సభ విజయవంతంతో చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని దుయ్యబట్టారు. వివిధ పారీ్టల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసినా తమ కార్యదీక్ష ముందు నిలవలేకపోయారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కారి్మకుల శక్తిని గుర్తించాలని సూచించారు. ఇందులో గాయపడ్డ కారి్మకులకు ఉచితంగా సేవ చేసేందుకు ముందుకొచి్చన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమంలో మావోయిస్టులు ఉన్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. 

చలో ట్యాంక్‌ బండ్‌ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుతున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగులు 

మరోసారి బంద్‌ ఆలోచన? 
సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు కారి్మక సంఘాల జేఏసీ సిద్ధమైంది. ఆదివారం ఉదయం జేఏసీ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నేపథ్యంలో కొందరు జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారమే అదుపులోకి తీసుకొన్నారు. జేఏసీ కో–కన్వీనర్‌ రాజిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకోగా జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి సహా ఇతర ముఖ్యులను ట్యాంక్‌బండ్‌ సమీపంలో శనివారం ఉదయం అరెస్టు చేసి రాత్రికి విడుదల చేశారు. దీంతో కొత్త కార్యాచరణ ఖరారుపై జేఏసీ నేతలు భేటీ కాలేకపోయారు. ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. పోలీసులు కార్మికులపట్ల కఠినంగా వ్యవహరించి లాఠీచార్జి జరపడంతో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా మహిళా కారి్మకులు ఎక్కువ మంది గాయపడ్డారు. దీన్ని జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతోపాటు స్వయంగా హైకోర్టు సూచించినా, పదుల సంఖ్యలో కారి్మకులు చనిపోయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం వంటి అంశాలను కారణంగా చూపుతూ మరోసారి రాష్ట్ర బంద్‌ నిర్వహించాలన్న అభిప్రాయాన్ని కొందరు అఖిలపక్ష నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నిర్బంధం
‘చలో ట్యాంక్‌బండ్‌’కు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీపీసీసీ కీలక నేతలతోపాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ నేతలను గృహనిర్బంధం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను హైదరాబాద్‌లో, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాలను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

ప్రజల ఉద్వేగం ముందు నిలవలేకపోయారు: చాడ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఉద్వేగం ముందు పోలీసులు తట్టుకోలేకపోయారని, మిలీనియం మార్చ్‌ను తలపించే విధంగా చలో ట్యాంక్‌బండ్‌ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలని, మరింత ప్రజాగ్రహానికి గురికాక ముందే చర్చల ద్వారా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల అతి ప్రవర్తనతో యుద్ధ వాతావరణం ఏర్పడిందని, ఈ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు.  

ఇకనైనా మొండి వైఖరి వీడాలి: తమ్మినేని 
తీవ్ర నిర్బంధాన్ని అధిగమించి చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం జయప్రదమైందని, ఇది కారి్మకులు సాధించిన విజయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజలు, ఆర్టీసీ కారి్మకులు, వామపక్షాలు, రాజకీయ పారీ్టల కార్యకర్తలు కలిసి విజయవంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ మొండి వైఖరిని విడనాడి కోర్టు సూచనలు పాటించి, చర్చల ద్వారా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సంఘాలు కూడా విలీనంపై పట్టుబట్టే అవకాశం అంతగా లేనందున కారి్మకుల సంక్షేమం కోసం ప్రతిష్టకు పోకుండా ఈ సమస్యకు ఇంతటితో తెరదించాలని సూచించారు.  

విపక్షాల గొంతు నొక్కుతున్నారు: కృష్ణసాగర్‌రావు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపక్షాల గొంతు నొక్కుతున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, తెలంగాణను పోలీస్‌ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను గృహ నిర్బం ధం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

హేయమైన చర్య: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  
సాక్షి, హైదరాబాద్‌: చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులపై బాష్పవాయువు ప్రయోగించడం, మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధం చేయడం, అక్రమ అరెస్ట్‌లకు పాల్ప డటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఓ ప్రకట నలో ఆయన విమర్శించారు. గత 36 రోజు లుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ప్రభుత్వ మొండితనం, మూర్ఖత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం బేషజాలకు పోకుండా ఆర్టీసీ జేఏసీని చర్చకు పిలిచి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అలా జరగని పక్షంలో ప్రభుత్వం కార్మికులు, రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

కేసీఆర్‌ ఓ నియంత: పొన్నాల 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’అని పీపీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకార్లను తలపించిన పోలీసులను తíప్పించుకొని చలో ట్యాంక్‌ బండ్‌ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. హన్మకొండలో ని తన నివాసంలో శనివారం సాయం త్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్‌ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్‌ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు