ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...

5 Oct, 2019 12:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ  నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్ప‍ష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు.

ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్‌ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.  ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్‌ రెడ్డి, తిరుపతి, వీఎస్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు.


డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన


రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన పోలీసులు


రాజేంద్రనగర్‌ బస్‌ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

బస్సు సీటు కోసం.. ఎన్ని పాట్లో

బస్సులు నిల్‌... మెట్రో ఫుల్‌...

ఆన్‌లైన్‌లోనే రిమ్‌‘జిమ్‌’

మంత్రి కేటీఆర్‌ పర్యటన వాయిదా!

ఫర్నిచర్‌ కొంటే ప్లాట్‌, కారు, యాక్టివా

సిటీలో స్తంభించిన ప్రజా రవాణా

వ్యూహం.. దిశానిర్దేశం

ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!

ఆర్టీసీ సమ్మె: మా టికెట్‌ రిజర్వేషన్ల సంగతేంటి?

సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు

ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...

కోలాహలమే ఆ ఆటంటే.. 

పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్‌

పూల ధరలు పైపైకి..

అంతంకాదిది.. ఆరంభమే..

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులనూ వినియోగించుకోండి

ఆ శాఖకు ఒకే ఒక్కడు..! 

బలైపోతున్న కార్మికులు

పాచిపోయిన పులిహోర.. 51 వేలు ఫైన్‌

బస్టాండ్‌ల వద్ద 144 సెక్షన్‌

దసరా హు‘సార్‌’

మద్యం పాలసీపై మల్లగుల్లాలు

నాటి మహిష్మతే..  నేటి భైంసా

లైవ్‌ అప్‌డేట్స్‌: కిటకిటలాడుతున్న మెట్రో స్టేషన్లు

మానవత్వం చాటుకున్న మంత్రి 

అప్నా సిటీ నం.1

ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే: లక్ష్మణ్‌

అంతర్జాతీయ వేదికపై ‘హరితహారం’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం