ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్‌ ఇచ్చిన జేఏసీ

22 Nov, 2019 13:50 IST|Sakshi

విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం

ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు: జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌:  కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్‌ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.  కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. (చదవండిఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే)

కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన  సమ్మెపై ప్రస్తుతం  కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా