న్యాక్‌ను ‘ఎక్సలెన్స్‌’గా తీర్చిదిద్దాలి

6 Jan, 2018 02:17 IST|Sakshi

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)ను సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందులో శిక్షణ పొందిన వారికి దేశవిదేశాల్లో ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన న్యాక్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా న్యాక్‌ ను తీర్చిదిద్దాలన్నారు.

జిల్లాల్లో న్యాక్‌ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు 12% పెంపు, ఎన్టీఏ ఉద్యోగులకు ఎల్‌టీసీ సౌకర్యం, ఉద్యోగులకు రవాణాభత్యం పెంపు అంశాలను ఆయన ప్రస్తావించారు. సమావేశంలో న్యాక్‌ కో చైర్మన్‌ హోదాలో సీఎస్‌ ఎస్పీ సింగ్, ప్రధాన కార్యదర్శి హోదాలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, డీజీ భిక్షపతి, రోడ్లు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ లింగయ్య, సాగునీటి శాఖ ఈఎన్సీ నాగేందర్, బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ సుగుణాకర్‌రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు