రేపే మహాయాత్ర

6 Sep, 2014 23:59 IST|Sakshi

గ్రేటర్ నగరం ఆధ్యాత్మిక సాగరమైంది. వీధివీధినా విభిన్న రూపాల్లో వినాయకుడిని కొలువుదీర్చిన జనం తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పూజలు... భజనలు... సాంస్కృతిక కార్యక్రమాలతో గణేశుని మండపాల పరిసరాల్లో సందడి నెలకొంది. శనివారం నాటికి తొమ్మిది రోజులు పూర్తి కావడంతో భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనం చేశారు. మేళతాళాలు.. డప్పుల దరువులు.. విచిత్ర వేషధారణలతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువుల్లో గణేశ నిమజ్జనం పూర్తి చేశారు. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాగణపతి కొలువైన ఖైరతాబాద్ పుణ్యక్షేత్రాలను తలపించింది.
ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది విశ్వరూప మహాగణపతిని దర్శించుకున్నారు. ఒక్క శనివారమే 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. నిమజ్జనానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఆదివారం సుమారు 3-4 లక్షల మంది ఖైరతాబాద్‌కు తరలి రానున్నారని అంచనా. మరోవైపు సోమవారం మహా గణపతితో పాటు సామూహిక నిమజ్జనానికి విగ్రహాలను తరలించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ఉత్సవ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
 
 నగరంలో ఇలా..
 30 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
     
 800 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు.
     
 605 సమస్యాత్మక ప్రాంతాలుగా, 310 అత్యంత
     
 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.
     
 410 మొబైల్ పార్టీలు
     
 ముందుజాగ్రత్త చర్యగా 30 బాంబ్ డిస్పోజబుల్ బృందాలను ఏర్పాటు చేశారు.
     
 మండపాల నుంచి విగ్రహాలను లారీల్లోకి ఎక్కించేందుకు 71 మొబైల్ క్రేన్లను వినియోగిస్తున్నారు.
     
రద్దీ ప్రాంతాలైన రైల్వే, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌తోపాటు వాహనాల తనిఖీలను నిమజ్జనం పూర్తయ్యే వరకు చేపడతారు.
     
నగరానికి చేరుకున్న విశాఖపట్నం నేవీకి చెందిన గజ ఈతగాళ్లు
     
అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిపి గత నెల 28 నుంచి చార్మినార్ వద్ద గల సర్దార్‌మహల్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కొనసాగిస్తున్నారు.
     
బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌తోపాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై ఉన్న గాంధీనగర్ ఔట్‌పోస్టు వద్ద పోలీసు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
     
నిమజ్జనాన్ని వీక్షించేందుకు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా జనం వచ్చే అవకాశం.
     
నగరంలో మొత్తం 23 వేల గణేశ్ విగ్రహాలను నెలకోల్పారు. మూడు, ఐదు, ఏడో రోజుల్లో పలు విగ్రహాలను నిమజ్జనం చేయగా సామూహిక నిమజ్జనానికి మరో ఏడు వేల వరకు మిగిలి ఉన్నాయి.    
 
సైబరాబాద్‌లో..
9,400 మందితో బందోబస్తు

ఇందులో ఏడుగురు డీసీపీలు, 25 మంది ఏసీపీలు, 90 మంది సీఐలు, 490 మంది ఎస్‌ఐలు ఉన్నారు.
 
బాంబ్ స్వ్కాడ్స్
 109 చోట్ల వాహనాల తనిఖీలు
 312 చోట్ల పికెట్స్, 112 మొబైల్ పార్టీలు
 57 పిక్ యాక్షన్ టీమ్‌లు
 51 క్రైమ్ కంట్రోల్ టీమ్‌లు
 30 ప్లటూన్ల స్పెషల్ పోలీస్
 

>
మరిన్ని వార్తలు