నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యే

5 May, 2017 00:48 IST|Sakshi
నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యే

పోస్టుమార్టమ్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడి
బంధుమిత్రుల నివాళి అనంతరం అంత్యక్రియలు పూర్తి
మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన భార్య పావని
ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల ఆరా


హైదరాబాద్‌: బుల్లితెర నటుడు ప్రదీప్‌ కుమార్‌ది ఆత్మహత్యేనని, అతను ఉరి వేసుకుని చనిపోయాడని పోస్టు మార్టమ్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అయితే ప్రదీప్‌ ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడంపై నార్సింగ్‌ పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం రాత్రి పది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరిగిన విషయాలు తెలుసుకునేందుకు నెక్నాంపూర్‌లోని ప్రదీప్‌ ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకు న్నారు. దీంతో పాటు ప్రదీప్‌ ఇంట్లో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తే అసలేం జరిగిందనేది తెలు స్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగం గా వారందరినీ శుక్ర, శనివారాల్లో ఠాణాకు పిలిపించి విచారించనున్నట్టు తెలిసింది.

ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు..
బుధవారం రాత్రి పోస్టుమార్టం పూర్తికావ డంతో ప్రదీప్‌ మృతదేహాన్ని నెక్నాంపూర్‌ లోని నివాసానికి తీసుకువచ్చారు. బుధ వారం ఉదయం ప్రదీప్‌ భౌతిక కాయానికి బంధుమిత్రులు, బుల్లితెర నటులు కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం ఇంటి నుంచి రాయదుర్గంలోని మహా ప్రస్థానానికి తరలించారు. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ప్రదీప్‌ సోదరుడు చైతన్య రామకృష్ణ బ్రహ్మణ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్య క్రియల సందర్భంగా ప్రదీప్‌ తల్లితో పాటు భార్య పావనిరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. వారిని బంధువులు, బుల్లితెర నటులు ఓదార్చారు. నిన్నమొన్నటి వరకు తమతో ఎంతో అప్యాయంగా ఉండే ప్రదీప్‌ ఇక లేడంటే నమ్మబుద్ధి కావటం లేదని బంధువులు, తోటి నటీనటులు భోరున విలపించారు. కాగా, ప్రదీప్‌ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు అతని భార్య పావనిరెడ్డి నిరాకరించారు.

కనిపించని శ్రావణ్‌..
పావనిరెడ్డికి సోదరునిగా చెప్పుకోవటం తో పాటు ప్రదీప్‌ మరణించే సమయం లోనూ ఫ్లాట్‌లోనే ఉన్న శ్రావణ్‌ గురువా రం అంత్యక్రియల్లో కనిపించలేదు. ప్రదీప్‌ బంధుమిత్రులు అంత్యక్రియల కార్యక్రమానికి వస్తారు కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే అతను దూరంగా ఉన్నట్టు తెలిసింది. కర్ణాటకలోని బెల్గాం నుంచి వచ్చిన పావ నిరెడ్డి బంధువులే అంత్యక్రియల్లో ఎక్కువ గా పాల్గొన్నారు. ప్రదీప్‌ ఇంటి వద్ద జరిగే కార్యక్రమాలతోపాటు అంతిమయాత్రను చిత్రీకరించన్వికుండా మీడియాను వీరు అడ్డుకోవటం చర్చానీయాంశమైంది.

మరిన్ని వార్తలు