వీక్షకుల కోసం చానళ్ల మధ్య పోటీ

14 Apr, 2018 09:47 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న నగ్మా సహార్‌

టీవీ యాంకర్‌ నగ్మా సహార్‌

రాయదుర్గం: దేశంలో ప్రస్తుతం 400 కంటే ఎక్కువ చానళ్లు వీక్షకుల కోసం పోటీపడుతున్నాయని ప్రముఖ టీవీ యాంకర్‌ నగ్మా సహార్‌ అన్నారు. గచ్చిబౌలిలోని మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్‌ మీడియా–ఆబ్జెక్టివిటీ అండ్‌ ప్రీజుడీసెస్‌ ఆఫ్‌ టీవీ న్యూస్‌ యాంకర్స్‌’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నగ్మా మాట్లాడుతూ.. ఆదాయ వనరుల సేకరణ ప్రతికూల వార్తల సేకరణపై ప్రభావం చూపిస్తోందన్నారు. న్యూస్‌రూమ్‌లో అతిథులను పూర్తి స్థాయిలో మాట్లాడనివ్వరని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మనూ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ మహ్మద్‌ అస్లామ్‌ పర్వేజ్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ ఎతేశ్యామ్‌ ఆహ్మద్‌ఖాన్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు