కన్న తల్లే హంతకురాలు

9 Mar, 2017 17:07 IST|Sakshi

► కవల పిల్లల అనుమానాస్పద మృతిని ఛేదించిన పోలీసులు
► భర్తకు పక్షవాతం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం
► తాను చావాలనుకుని ముందు పిల్లలను చంపిన వైనం
దోమకొండ (కామారెడ్డి) : బీబీపేట మండల కేంద్రంలో కవల పిల్లల అనుమానాస్పద స్థితిలో మృతిని పోలీసులు ఛేదించారు. కన్నతల్లే పిల్లలను  చంపినట్లు ఇన్‌చార్జి సీఐ శ్రీధర్‌ కుమార్‌ బుధవారం దోమకొండలో విలేకరుల సమావేశంలో తెలిపారు.  బీబీపేటకు చెందిన దంపతులు కల్పన, యాదగిరికి ఏడాది వయసున్న కవల పిల్లలు జైనిష్, జైనిత్‌ ఉన్నారు. వీరు గత ఏడాది నవంబర్‌ 30న అనుమానాస్పద స్థితిలో మృతిచెం దారు. తల్లినే అనుమానించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో పిల్లలను చంపింది తానేనని కల్పన ఒప్పుకుంది. కల్పన భర్త యాదగిరికి సంవత్సరం క్రితం çపక్షవాతం వచ్చి కాలు, చేయి చచ్చుబడిపోయాయి. కుటుంబ పరిస్థితి భారంగా మారి పూట గడవడం కష్టమైంది.

కల్పన జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనుకుంది. తాను చనిపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమిటని, ముందు పిల్లలను చంపాలనుకుంది. ఉదయం పిల్లలకు పాలు బిస్కట్‌లు తినిపించి పడుకోబెట్టింది. వారు పడుకున్నాక ఊపిరి ఆడకుండా ముక్కు మూసి చంపేసింది. అనంతరం తాను చనిపోవాలనుకునే సమయానికి ఇంటికి బంధువులు వచ్చారు. ఏం చేయాలో తెలియక కావాలనే ఎవరో తన పిల్లలను చంపారని బుకాయిం చింది. బంధువులు రాకపోతే తాను చనిపొయేదానినని విచారణలో కల్పన వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కల్పనను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు çపంపారు. సమావేశంలో దోమకొండ ఎస్సై నరేందర్, బీబీపేట ఎస్సై రవిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు