నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

28 Jun, 2015 17:29 IST|Sakshi

ఖమ్మం: ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీలోని గుత్తికోయలో నివాసముంటున్న కొత్తూరు బంజర తండాకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ కుంటలో పడి మృతిచెందారు. తండాకు చెందిన చందు (9), కిరణ్ (8) ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లి కుంటలో మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు