చేవెళ్లలో ప్రజాగ్రహం

18 Sep, 2016 02:54 IST|Sakshi
చేవెళ్లలో ప్రజాగ్రహం

జిల్లా కేంద్రం చేయాలంటూ స్థానికుల ఆందోళన
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్ష నాయకులు, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల చేవెళ్ల బంద్ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో స్థానికులు ఆందోళనలో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్- బీజాపూర్, ముంబై - బెంగళూరు రహదారులను దిగ్బంధించడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిల్చిపోయారుు.

ఇప్పటికే చేవెళ్లను జిల్లా కేంద్రం చేయాలని ఆందోళన చేస్తున్న స్థానికుల్లో మొరుునాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలనే ప్రభుత్వ నిర్ణ యం ఆగ్రహాన్ని పెంచింది. బంద్ సందర్భంగా బస్సులు నడవలేదు. ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద కనీసం బైక్‌లను సైతం వెళ్లనివ్వలేదు. మిషన్  భగీరథ పైపులను రోడ్డుకు అడ్డంగా ఉంచి వాహనాలను అడ్డుకున్నారు. రహదారులపై టైర్లకు నిప్పం టించి నిరసన తెలిపారు.

 పోలీసుల ప్రేక్షక పాత్ర
చేవెళ్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. బంద్ సందర్భంగా హైదరాబాద్ - బీజాపూర్, ముంబై- బెంగళూరు జాతీయ లింకు రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోరుు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత డీఎస్పీ శ్రుతకీర్తి, ఎస్‌ఐ భీంకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కానీ చేవెళ్లలో మాత్రం ట్రాఫిక్ సాయంత్రం వరకు క్లియర్ కాలేదు. పొద్దుపోయేవరకు వాహనదారులు తిండీ తిప్పలు లేక అవస్థలు పడ్డారు.

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: షబ్బీర్
తాండూరు వెళ్తున్న మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ వాహనం సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోరుుంది. దీంతో ఆయన సైతం ఆందోళనకారులకు మద్ద తు తెలిపి మాట్లాడారు. కేసీఆర్ చేష్టలు పిచ్చితుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు