కాలువలోకి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరి మృతి

18 Feb, 2016 08:22 IST|Sakshi

రామగుండం: కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రామగుండం మండలం బసంత్‌నగర్ ఏయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రామగుండంకు వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎన్టీపీసీకి చెందిన మిట్టా రాజ్‌కుమార్(20), మల్లేష్(21)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

మరిన్ని వార్తలు