రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

26 Feb, 2016 11:34 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వెళుతున్న కారు.. బైక్ ను ఢీ కొనడంతో.. ఈ ప్రమాదం జరిగింది. బోధ్ మండలం కొచ్చర గ్రామానికి చెందిన రాజుకిరణ్ రెడ్డి(30), స్వామి (50) బైక్ పై నిర్మల్ వైపు వెళుతున్నారు. నేరడిగొండ వద్ద వీరి బైక్ ఎదురుగా వచ్చిన స్విఫ్ట్ కారు ఢీకొంది. తీవ్ర గాయాలతో రాజుకిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, స్వామిని నిర్మల్కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందాడు.

 

మరిన్ని వార్తలు