'అమృత్' సదస్సుకు రామగుండం మేయర్

23 Jun, 2015 07:57 IST|Sakshi

కరీంనగర్: రాజధాని న్యూఢిల్లీలో జరిగే 'అమృత్' సదస్సులో కరీంనగర్ జిల్లాకు చెందిన రామగుండం, జగిత్యాల అధికారులు పాల్గొననున్నారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో రాజధానిలో జరిగే సదస్సులో స్మార్ట్‌సిటీలు, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణ, జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌తోపాటు కమిషనర్లు నేడు బయలుదేరనున్నారు.

మరిన్ని వార్తలు