ఇద్దరు మావో కొరియర్ల అరెస్టు

22 Mar, 2017 10:45 IST|Sakshi

చర్ల(ఖమ్మం జిల్లా): మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేందుకు వినియోగించే ఎలక్ట్రిక్‌ వైరు బండిళ్లను తరలిస్తున్న ఇద్దరు కొరియర్లను చర్ల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. చర్ల ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చర్లలో గాంధీ సెంటర్‌ సమీపంలోఅనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులకి తీసుకున్నారు.

విచారణలో ఒకరిది చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌జిల్లా కారేపల్లికి చెందిన మడివి కోసా అని, మరొకరిది అదే జిల్లాలోని చండ్రంబోరు గ్రామానికి చెందిన మడకం కములు అలియాస్‌ మహేష్‌గా వెల్లడించారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు వైర్‌ బండిళ్లు లభ్యమైనట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు నేతలు హరిభూషన్, దామోదర్, ఆజాద్‌ ఆదేశాల మేరకు రూ.40 వేలతో మహబూబాబాద్‌లోని మోహన్‌ అనే ఎలక్ట్రికల్‌ షాపు యజమాని వద్ద నుంచి 3 వేల మీటర్ల పొడవు గల 8 వైరు బండిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. వీరిద్దరు పామేడు లోకల్‌ ఆర్గనేజేషన్‌ స్వా్కడ్‌ కమాండర్‌ కమలక్క నేతృత్వంలో పని చేస్తున్నట్లు వెల్లడించారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపారు.

 

మరిన్ని వార్తలు