దహన సంస్కారాలకు వెళ్లి వస్తూ..

1 Apr, 2017 20:09 IST|Sakshi
దహన సంస్కారాలకు వెళ్లి వస్తూ..
► ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
► ఇద్దరు మృతి 
 
ఖానాపురం: బంధువు మృతి చెందగా దహన సంస్కారాల కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో  జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘ టన శుక్రవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానపురం మండలం బుధరావుపేటలో చోటుచేసుకుంది. బం« దువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్రతండా(రామన్నగూడెం)కు చెందిప బానోతు వీరన్న(40), వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలతండాకు చెందిన అజ్మీరా రాజు(35)లు తమ సమీప బంధువు అయిన ఖా నాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని భద్రుతండాకు చెందిన బానోతు ఈర్య గురువారం మృతి చెందడంతో మృతుడి దహ న సంస్కారాల నిమిత్తం శుక్రవారం వీరన్న, రాజు వేర్వేగా భద్రుతండాకు వచ్చారు.

దహన సంస్కారా లు పూర్తి అయిన అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో బానోతు వీరన్న తన ద్విచక్ర వాహనంపై అజ్మీరా రా జుతో కలసి నర్సంపేట వైపునకు వస్తున్నాడు. బుధరావుపేట గ్రామం దాటిన తర్వాత సంగెం కాల్వ స మీపంలో రాగానే ఎదురుగా అతివేగంతో వచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బానోతు వీరన్న, అజ్మీరా రాజులు అక్కడికక్కడే మృ తి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోని బోరున విలపించారు.

ప్రమాదానికి కారణ మైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో రూరల్‌ సీఐ బోనాల కిషన్, ఎస్సై దుడ్డెల గురుస్వామి ఆందోళనకారులతో మాట్లాడి పరి స్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.  కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృ తుడు బానోతు వీరన్నకు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అజ్మీరా రాజుకు భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు.  
 
మరిన్ని వార్తలు