గాంధీలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి 

15 Mar, 2019 02:53 IST|Sakshi

రూపాంతరం చెంది మరింత బలపడిన వైరస్‌

హైదరాబాద్‌: గతంలో చలికాలంలో మాత్రమే ప్రభావం చూపించే స్వైన్‌ఫ్లూ వైరస్‌ రూపాంతరం చెంది వేసవిలోకూడా విజృంభిస్తోంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో గురువారం ఓ వృద్ధురాలితోపాటు మరో యువతి స్వైన్‌ఫ్లూతో మృతి చెందారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం తుర్కగూడకు చెందిన యువతి (24) ఈ నెల 1న కొత్తపేట ఓమ్నీ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈనెల 13న మృతిచెందింది. హైదరాబాద్‌ దమ్మాయిగూడ వైశక్తినగర్‌కు చెందిన వృద్ధురాలు (80) స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ సీసీ షరాఫ్‌ ఆస్పత్రి నుంచి ఈ నెల 6న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందింది.

కర్మన్‌ఘాట్‌ హను మాన్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు (62), మేడ్చల్‌ గుండ్లపోచంపల్లికి చెంది న మరో వృద్ధురాలు (64), మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ సూరప్‌నగర్‌కు చెందిన మరోవ్యక్తి (42), నాగర్‌కర్నూల్‌ గోలగుండం తెల్కపల్లికి చెందిన యువతి (25), ఓల్డ్‌బోయినపల్లి మల్లికార్జుననగర్‌కు చెందిన వృద్ధురాలు (65)లతోపాటు మరో నలుగురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు గాంధీలో చికిత్సలు అందిస్తు న్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఈ ఏడాది గాంధీలో మొత్తం 59 స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారని, ఐదుగురు చికిత్స పొందుతున్నారని చెప్పారు.  

మరిన్ని వార్తలు