ధ్రువపత్రాల జారీ కేసులో ఇద్దరికి రిమాండ్

7 Sep, 2015 18:41 IST|Sakshi

కుంటాల (ఆదిలాబాద్) : తహశీల్దార్‌కు తెలియకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో వీఆర్‌ఏతోపాటు తాత్కాలిక ఉద్యోగి ఒకరిని పోలీసులు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుంటాల మండలానికి చెందిన వీఆర్‌ఏ గంగాధర్, తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న మరో వీఆర్‌ఏ లక్ష్మీబాయి కుమారుడు రవి కలసి మహారాష్ట్ర వాసులు 12 మందికి కుల తదితర ధ్రువీకరణపత్రాలు జారీ చేశారు. దీనిపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ మేరకు సీఐ వినోద్ ఆధ్వర్యంలో విచారణ జరిపి, ఆరోపణలు రుజువని తేలటంతో సోమవారం గంగాధర్, రవిలను రిమాండ్‌కు పంపారు.తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పుష్కరాల విధుల్లో ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే వారిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, పలువురికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని ఈ సందర్భంగా సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు