క్రికెట్ బంతి కోసం నీట మునిగి ఇద్దరి మృతి

22 Nov, 2015 16:29 IST|Sakshi

నిర్మల్: ఆదిలాబాద్ జిల్లాలో క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన నిర్మల మండలం మంజులాపూర్ గ్రామంలో మోతీ తలాబ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మొహమ్మద్ నవ్‌మాన్(14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా.. అబుల్(15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం.. స్నేహితులతో కలిసి గ్రామ శివారును ఉన్న చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి వెళ్లి చెరువులో పడటంతో.. నవ్‌మాన్ బంతి తీసుకురావడానికి చెరువులోకి వెళ్లాడు. చెరువులోతు ఎక్కువగా ఉండటంతో.. నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన అబుల్ అతన్ని రక్షించడానికి చెరువులోకి దిగాడు. ఇతనికి కూడా ఈత రాకపోవడంతో.. ఇద్దరు నీట మునిగి మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు