‘షీటీం’కు ద్విచక్రవాహనాలు 

23 Mar, 2018 15:54 IST|Sakshi
ర్యాలీ ప్రారంభిస్తున్న సీపీ 

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో షీటీంలకు చెందిన పోలీసులు గస్తీ నిర్వహించేందుకు ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్‌ కమిషనరేట్‌లోని హెడ్‌ క్వార్టర్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో మోటాకార్ప్‌ కంపెనీ రీజినల్‌ మేనేజర్‌ కమల్‌ కరమ్‌చందాని 20 డుయోట్‌ వాహనాల తాళాలను సీపీ కమలాసన్‌రెడ్డికి అందజేశారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులకు ప్రోత్సాహమందిస్తే మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు.

కమిషనరేట్‌వ్యాప్తంగా 14 షీటీంలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మానేరు డ్యాం, జింకలు, ఉజ్వల పార్కుల సమీపంలో లేక్‌ పోలీసు ఏర్పాటు చేసిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణలోకి వచ్చాయని అన్నారు. కమల్‌ కరమ్‌చందాని మాట్లాడుతూ పోలీసు శాఖకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరీంనగర్‌ షీటీం సభ్యులకు 20 ద్విచక్రవాహనాలు అందజేస్తున్నామని తెలిపారు.

హీరో మోటాకార్స్‌ అందజేసిన 20 ద్విచక్రవాహనాలతో షీటీం సభ్యులు చేపట్టిన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు వెంకటరమణ, ఉషారాణి, హీరో ఆటోమోటాకార్స్‌ ప్రతినిధులు కష్యప్, కిరణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు మహేశ్‌గౌడ్, విజయకుమార్, సదానందం, సీతారెడ్డి, రవి, ఆర్‌ఐలు జానీమియా, మల్లేశం, శేఖర్, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, వసంత్‌కుమార్‌ ఓజా, గఫార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు