హృదయ విదారకం

23 Sep, 2019 09:06 IST|Sakshi
ఇందిరా, స్వాతి మృతదేహాలు

కాల్వలో పడిన కారు

అత్తా, కోడలు దుర్మరణం

సాక్షి, మరిపెడ: ప్రమాదవశాత్తు కారు కాల్వలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న అత్తా, కోడలితో పాటు కోడలి కడుపులోని శిశువూ మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం గొల్లగూడెం వద్ద చోటుచేసుకుంది. మృతులు మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన వారు. స్థానికుల కథనం ప్రకారం.. పోగుల రవీందర్‌రెడ్డి, ఇందిరా(45) దంపతుల పెద్ద కుమారుడు మహిపాల్‌రెడ్డికి నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన ఇట్టి దామోదర్‌రెడ్డి, పద్మ దంపతుల రెండో కుమార్తె స్వాతి(28)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. మహిపాల్‌రెడ్డి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా నెల్లికుదురులో విధులు నిర్వహిస్తున్నాడు.

భార్య స్వాతి గర్భవతి కావడంతో రెండు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించడానికి వెళ్లారు. ఆదివారం రిపోర్టులు వస్తాయని చెప్పడంతో  మహిపాల్‌ తన తల్లి ఇందిరా, భార్య స్వాతితో కలిసి కారులో ఖమ్మంకు బయలుదేరారు. మార్గ మధ్యన గొల్లగూడెం సమీపాన ఉన్న కాల్వ వద్దకు రాగానే.. మూత్ర విసర్జన కోసమని కొద్ది దూరంలో ఆగారు. అనంతరం కారు రివర్స్‌ తీస్తున్న సమయంలో అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఇందిరా, స్వాతి అక్కడిక్కడే మృతి చెందగా.. మహిపాల్‌రెడ్డిని స్థానికులు కాపాడారు. మృతి చెందిన స్వాతి నిండు గర్భవతి కావడంతో స్థానికుల సహయంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆపరేషన్‌ చేసి మగశిశువును వెలికి తీసారు. అప్పటికే శిశువు ప్రాణాలు వదిలినట్లు స్థానికులు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పదిలం బిడ్డా! మన బడి.. మారలేదమ్మా!

ఫిట్‌ ఫంక్షన్‌

బీజేపీలోకి అన్నపూర్ణమ్మ!

టిక్‌టాక్‌.. షాక్‌

ఐఆర్‌సీటీసీ వింటర్‌ టూర్స్‌

బాత్రూంలో బడి బియ్యం

ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ మారని రూపురేఖలు

ట్రూజెట్‌ విమానంలో సాంకేతిక లోపం

ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు

సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి

బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తాం

గట్టు.. లోగుట్టు! 

కింగ్‌..ట్రాఫిక్‌ వింగ్‌

నేటి నుంచి బతుకమ్మ కానుకలు 

మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..

దేవుడా.. ఎంతపనిజేస్తివి! 

పల్లెల్లో ‘క్రిషి’

ఆ పైసలేవీ?

వర్షం @ 6 సెం.మీ

మంత్రివర్యా.. నిధులివ్వరూ! 

పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ

కేంద్రం ఇచ్చింది.. 31,802 కోట్లే

కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ తెస్తాం

అప్పులు 3 లక్షల కోట్లు

బార్‌ లైసెన్సుల అనుమతి పొడిగింపు 

తీరొక్క కోక.. అందుకోండిక!

రూ. 45,770 కోట్లు  తప్పనిసరి ఖర్చు

ఎయిర్‌ పోర్ట్‌కు 25 నిమిషాల్లో జర్నీ..

9... నెమ్మది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌