డీఎస్పీకి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష

30 Jun, 2018 01:41 IST|Sakshi

కరీంనగర్‌ ఏసీబీ కోర్టు తీర్పు

నిజామాబాద్‌ క్రైం:  లంచం తీసుకున్న డీఎస్పీకి కరీంనగర్‌ ఏసీబీ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిఖ విధించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. నిజామాబాద్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ తిరునగిరి శ్రీనివాస్, విజయకుమారిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత వీరి మధ్య విభే దాలు రావడంతో విజయకుమారి భర్త శ్రీనివాస్‌పై 2006 జూలై 9న నగరంలోని 5వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో అప్పటి ఎస్పీ సస్పెండ్‌ చేశారు.

తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పటి డీఎస్పీ విలియమ్స్‌ను కోరగా రూ. 15 వేలు లంచం డిమాండ్‌ చేశాడు.  ఏసీబీ  సూచన మేరకు డబ్బులు ఇస్తుండటంతో అధికా రులు పట్టుకున్నారు. ఈ కేసులో శుక్రవారం ఏసీబీ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేముల లక్ష్మీప్రసాద్‌ తన వాదనలు వినిపించా రు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. 

మరిన్ని వార్తలు