ఫ్లూతో రెండేళ్ల బాలుడి మృతి

29 Jan, 2015 22:23 IST|Sakshi

ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్‌ప్లూతో మంగళవారం రాత్రి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన అంజా (2) అనారోగ్యంతో ఈ నెల 25వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సోకినట్లుగా అనుమానించిన వైద్యులు 27వ తేదీన తెమడ నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రీవెంట్ ఆఫ్ మెడిసిన్‌కు పంపించారు.

ఈ క్రమంలో 27వ తేదీ రాత్రి మృతి చెందాడు. సోమవారం పంపించిన బాలుడి నమూనాల ఫలితాలు బుధవారం రాత్రి అందినట్లు ఎంజీఎం ఆర్‌ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, బాలుడి తల్లి 18వ తేదీన స్వైన్‌ప్లూ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

మరిన్ని వార్తలు