లడ్డూలను ఎగురవేసిన జగ్గారెడ్డి

9 Apr, 2016 03:38 IST|Sakshi
లడ్డూలను ఎగురవేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డిలో ఉగాది సంప్రదాయం కొనసాగింపు
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉగాది పండుగ సందర్భంగా లడ్డూలను ఎగురవేయడం ఆనవాయితీ. వరిపేలాలతో తయారు చేసిన లడ్డూలను ఎగురవేస్తారు. ఈ సంప్రదాయన్ని శుక్రవారం కొనసాగించారు. అన్ని ఆలయాల్లో సాయంత్రం పంచాంగ శ్రవణం, షడ్రసోపేతమైన పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత లడ్డూలను ఊరేగింపు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు ఆలయం పైకి చేరుకుని లడ్డూలను విసిరారు. ఆలయం కింద వేచి ఉన్న భక్తులు పోటీపడి వాటిని అందుకున్నారు.

ఈ లడ్డూలను తింటే ఏడాది అంతా శుభం కలుగుతుందని పట్టణ ప్రజల విశ్వసిస్తారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి రామాలయంలో నిర్వహించిన ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రామాలయంపైకి చేరుకుని లడ్డూలను ఎగురవేశారు.

మరిన్ని వార్తలు