గాలికి పోయేవాళ్లం కాదు

24 Feb, 2017 03:25 IST|Sakshi
గాలికి పోయేవాళ్లం కాదు

ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడుతాం: కోదండరాం
ర్యాలీ విజయవంతమైంది
సమస్య తీవ్రత అందరికీ అర్థమైంది
ముస్లింల సమస్యలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం  


సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నించేవాళ్లు ఉండకూ డదని ప్రభుత్వంలో ఉన్నవారు కోరుకు న్నా.. తాము గాలికి కొట్టుకు పోయేవాళ్లం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ఎన్ని నిర్బం ధాలు విధించినా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. గురువారం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులు, అనంతరం పరిణామాలు తదితర అంశాలపై అందులో చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని... ఈ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాలనే తమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని ఆయన చెప్పారు.

ర్యాలీ, సభ విషయంలో సంఘీ భావంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల ప్రకారం నిరసన తెలపడానికి తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అర్ధరాత్రి తమ ఇంటిపైకి వచ్చి, తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయాల్సిన పరిస్థితులు, అవసరం ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమను ఏ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారో కూడా తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచా ల్సిన అవసరమేమిటని నిలదీశారు.

భూనిర్వాసితుల సమస్యపై రాష్ట్రపతిని కలుస్తాం
పోలీస్‌స్టేషన్‌లో తమను కలవడానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను కూడా పోలీ సులు అరెస్టు చేయడం దుర్మార్గమని కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, పోలీసులతో వేధింపులకు గురిచేసినా పట్టించుకోవాల్సి న అవసరం లేదన్నారు. 5 వేల మందిని అరెస్టు చేయడం, వేలాది మంది పోలీసులను మోహరించడం ఎలాంటి సంకేతమో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఉస్మాని యా, కాకతీయ వర్సిటీల్లోని హాస్టళ్ల వద్ద సాయుధ బలగాలను పెట్టారని, నాయకులు, నేతల ఇళ్లపై పడి అరెస్టులు చేశారని... అయినా నిరసన ప్రదర్శన జరిగిందన్నారు. మొత్తంగా జేఏసీ ప్రతిపాదించిన అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగిందని, తాము సంపూర్ణ విజయం సాధించామని చెప్పా రు.

 స్వామి అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్‌ భూషణ్‌ వంటివారు తమకు ఫోన్లు చేసి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును ఖండించారన్నారు. భూనిర్వాసితుల సమ స్యపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ముస్లింల సమస్యలపై సుధీర్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తా మని.. మార్చి 1న మహబూబ్‌నగర్‌లో, 4న నిజామాబాద్‌లో వాటిని ఏర్పాటు చేస్తున్నా మని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కె.రఘు, ప్రహ్లాదరావు, వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, భైరి రమేశ్, గోపాల శర్మ, గురజాల రవీందర్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు