తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ భేష్‌

18 Sep, 2018 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఉత్తమ పోలీసింగ్‌ వ్యవస్థ అమలవుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ అభినందించారు. మంగళవారం ఆయన దేశంలో రెండో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా స్థానం సాధించిన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ని సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. షీ టీమ్‌ల ఏర్పాటు చాలా మంచి ప్రయత్నమని అభినందించారు. నేరాల నియంత్రణ కోసం ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధనాలు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు.  అనంతరం పోలీస్‌ స్టేషన్‌లోని సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర కమిషనర్‌ అంజ‌నీకుమార్‌, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్‌ శ్రీనివాస్‌, పంజాగుట్ట ఎసీపీ విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

అనంతరం డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టెక్నాటజీ సాయంతో కేసులను చేధిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీకస్‌ స్టేషన్లని ఆధునికరిస్తాం అని మహేందర్‌ రెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు