కొలిక్కిరాని దర్యాప్తు

26 Mar, 2018 17:01 IST|Sakshi
మంటల్లో కాలిపోయిన వ్యక్తి మృతదేహం(ఫైల్‌)

మిస్టరీగానే టీ కొట్టులో కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి కేసు  

ఏడాది దాటిన పురోగతి శూన్యం

సాక్షి,కొత్తూరు: ఇటీవల హైదరాబాద్‌ శివారులో ఓ గర్భిణినీ హత్య చేయడంతో పాటు శరీర భాగాలను ముక్కలుగా చేసి సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను నెల రోజుల్లోపే గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్‌లో చిన్నారి నరబలి కేసును సైతం పోలీసులు సవాల్‌గా తీసుకొని రోజుల్లోనే చేధించారు. కాగా కొత్తూరు మండల కేంద్రంలో గతేడాది మార్చిలో టీకొట్టు ఘటనలో కాలిబూడిదైన గుర్తుతెలియని వ్యక్తి కేసు ఏడాది గడుస్తున్నా మిస్టరీగానే మిగిలింది.  

మంటలు అర్పిన తర్వాత మృతదేహం గుర్తింపు....   
గతేడాది మార్చి 22వ తేదీన అర్ధరాత్రి సమయంలో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ టీకొట్టుకు నిప్పంటుకుందనే సమాచారంతో పోలీసులు ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇచ్చి మంటలను అదుపుచేశారు. తర్వాత అక్కడ పరిశీలించగా కొట్టుతో పాటు అందులో సగానికి పైగా కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. అప్పట్లో ఆ విషయం మండలంలో సంచలనం సృష్టించింది. కాగా పోలీసులు ఉద యాన్నే సంఘటన స్థలానికి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పి ంచి కొన్ని ఆధారాలు సేకరించారు. టీకొట్టు నడిపే వ్యక్తి ఛా య్, సిగరెట్లతో పాటు కిరోసిన్, పెట్రోలు సైతం విక్రయించేవాడు. రాత్రి సమయంలో అందులో చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి అందులోకి పైకప్పు తొలగించి దూకడంతో పెట్రోలు డ బ్బాలు పగిలిపోవడం. వెలుతురు కోసం ఆగ్గిపుల్ల వెలిగించడంతో ప్రమాదం జరిగినట్లు అప్పట్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీకొట్టు నిర్వహించే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినా ఎలాంటి ఫలితం లేదు.  

ప్రమాదంపై పలు అనుమానాలు..
గతేడాది మార్చి 22వ తేదీన మండలంలో సంచలనం సృష్టించిన ఘటన ఏడాది గడుస్తున్న నేటికీ మిస్టరీగానే మిగిలింది. టీకొట్టు ప్రమాదంలో మృతి చెందింది చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తేనా..? మరో వ్యక్తా..? ఒకవేళ చోరీకి వస్తే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై రూరల్‌ సీఐ మధుసూదన్‌ను వివరణ కోరగా సంఘటనకు సరైన ఆధారాలు లభించని కారణంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు.
 

మరిన్ని వార్తలు